పదవి ముఖ్యం కాదు గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తా
:గ్రామ అభివృద్ధి కి పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంగా పని చేద్దాం: దొంతగాని అప్పారావు
Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని కాపుగల్లు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ నెంబర్లు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయము నందు ప్రత్యేక అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ తో పాటు వార్డ్ మెంబర్స్ లు ప్రమాణ స్వీకారం నిర్వహించినారు. అనంతరం సర్పంచ్ అప్పారావు మాట్లాడుతూ కుల మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికై ఐక్యమత్యంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు.

గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని అన్నారు. మాపై నమ్మకంతో గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



