పదవ తరగతి వార్షిక పరీక్షలకు మంచి మార్కులు తెచ్చుకోవాలి:కలెక్టర్
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 02(ప్రతినిధి మాతంగి సురేష్): విద్యార్థులు పదవ తరగతి వార్షిక పరీక్షలకు పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకాక్షించారు.
మంగళవారం కోదాడ మండలం కొమరబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పదవ తరగతి లో జరుగుతున్న ఫిజిక్స్ సబ్జెక్టు నోట్ బుక్ లను పరిశీలించారు. పదవ తరగతి పరీక్షలకు రైటింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తేనే మంచి మార్కులు వస్తాయని సూచించారు.
మీరు భవిష్యత్ లో ఏమి అవ్వాలని ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకొని చుదువు కుంటే కలిగే ప్రయోజనాలను విద్యార్థులకి తెలియజేసి ప్రోత్సాహించారు.
తదుపరి కోదాడ బాలుర ఉన్నత పాఠశాల లో జరుగుతున్న మండల స్థాయి క్రీడా పోటీలను సందర్శించి చదువు తో పాటు ఆటలపై శ్రద్ద పెట్టాలని విద్యార్థులను ప్రోత్సాహించారు.
అనంతరం
కోదాడ పట్టణం లో వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పనులు వేగవంతంగా జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు.
ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజీద్ అలీ,మున్సిపల్ కమిషనర్ రమాదేవి,ఎం ఈ ఒ సలీం షరీఫ్,హాస్పిటల్ సూపరిటీడెంట్ ప్రవీణ్, ప్రధాన ఉపాధ్యాయులు గోవింద్, మార్కండేయ, ఉపాధ్యాయులు శేషగిరిరావు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



