పదివేలు కొట్టు పాసుబుక్కు పట్టు….!!
రైతులపై దుర్భాషలాడిన తాసిల్దార్
రైతుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న అనంతగిరి తాసిల్దార్
కోదాడ,మే 30(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలానికి చెందిన కొంతమంది రైతులు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మూడు రోజుల క్రితం స్లాట్ బుక్ చేసుకొని తాసిల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ తాసిల్దారుని కలిసి భూమి వివరాలు తెలియపరచినా సమయంలో భూమికి సంబంధించి అన్ని కాగితాలు ఉన్న ఒక్క స్లాట్ కి పదివేల రూపాయలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తాను అని రైతులను డిమాండ్ చేశారు ఇదేంటి అని రైతులు మా దగ్గర భూమికి సంబంధించి అన్ని కాగితాలు ఉన్నాయి కదా మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని రైతులు ప్రశ్నిస్తే తాసిల్దారి వారిపై దుర్భాషలాడి నోటరీ కావాలి ఇతర ఆధారాలు కావాలి అని వారి కాడ ఉన్న కాగితాలు విసిరేసి మీ దిక్కు ఉన్నవారి కి చెప్పుకోండి అని బెదిరిస్తున్నాడు అని రైతులు బాధతో ఆవేదన వ్యక్తపరిచారు

రైతులకు న్యాయం చేయాల్సిన అధికారులే డబ్బులకు ఆశపడుతూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని తాసిల్దార్ కార్యాలయంలో ఎదురుగా గురువారం రోజున ధర్నా చేశారు.అనంతగిరి తాసిల్దారి పైన జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వాపోతున్నారు.



