పని ప్రదేశంలో లైంగిక వేధింపులు నివారణ నిషేధ చట్టంపై అవగాహనా కార్యక్రమం
Mbmtelugunews/)కోదాడ,అక్టోబర్ 28(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక కోదాడ పట్టణ కేంద్రం లోని జీవీ మాల్ నందు సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ చైతన్య ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.పనిప్రధేశంలో మహిళలకు ఏటువంటి ఇబ్బందులు కలిగిన లైంగిక వేధింపులకు గురి ఐనా వెంటనే పిర్యాదు చేయాలనీ ప్రతి మహిళా సంతోషంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా పని చేసుకోవాలని అప్పుడే మహిళా సాధికారత సాధించినట్టు అని అన్నారు.ఎక్కడైతే పదిమంది లేదా అంతకంటే ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తారో అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.ఆ కమిటీ ద్వారా మహిళా తన స్వేచ్ఛ కాపాడబడుతుంది అని అన్నారు.అదే విదంగా ప్రతి మహిళా కుటుంబ సభ్యులతో వేధింపులకు గురైతే వెంటనే సఖి టోల్ ఫ్రీ నెంబర్ 181 కి కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చునని మహిళల కోసం 24 గంటలు సఖి సెంటర్ సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు.ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జీవీ మాల్ మేనేజర్ సాయి కుమార్,మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ రేవతి,వినోద్,జీవీ మాల్ సిబ్బంది పాల్గొన్నారు