పరిశుభ్రమైన దుకాణాలలో ఆరోగ్య మాంసం విక్రయాలు జరగాలి: డా, పి పెంటయ్య
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 10 (ప్రతినిది మాతంగి సురేష్): జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆదివారం కోదాడ పట్టణం లో మాంసం దుకాణాలను తనిఖీ చేసిన కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య. పట్టణం లోని వివిధ మాంసం దుఖానాలు, రోడ్లవెంబడి మాంసం విక్రయాల పై మున్సిపల్ కార్యాలయం సానిటరీ అధికారులు, జవాన్ లతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించి గొర్రెలు, మేకల మాంసం, పశువుల మాంసం, పంది మాంసం, చేపల మాంసం విక్రయాలు నిర్వహిస్తున్న మొత్తం 58 దుకాణాలను తనిఖీ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య .

పట్టణం లో ఇదివరకు ఉన్న రెండు పశు వదశాలల భవనాలు శిథిలమై పోవడంతో పట్టణంలో 35 చోట్ల గొర్రెపోతులు మేకపోతుల ను వారి వారి ఇండ్లలో లేదా రోడ్ల వెంబడి కట్ చేసి రోడ్లపైనే మాంసం విక్రయం చేస్తున్నారని, కేవలం ఒక్క మటన్ దుకాణంలో మాత్రమే మటన్ కటింగ్, విక్రయాలు జరుగుతున్నాయని 9 సెంటర్లలో పశు మాంసం విక్రయాలు, 5 కేంద్రాల్లో పంది మాంసం విక్రయాలు , 9 కేంద్రాల్లో చేపల విక్రయాలు జరుగుతుండగా చాలా వరకు రోడ్ల వెంబడే మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి అని గుర్తించారు. నిబంధనల ప్రకారం విశాలమైన పరిశుభ్రంగా ఉన్న పశువదశాలలో పశువైద్యాధికారులు పరీక్షించిన, ఆరోగ్యంగా ఉన్న పశువుల్ని వధించిన పిదప ధ్రువీకరించి స్టాంప్ వేసిన మొండాల్ని మాంసం విక్రయ ప్రదేశాలకు తీసుకువెళ్లి పరిశుభ్రమైన ప్రాంతాల్లో మాంసాన్ని విక్రయించాలి అని, మెరుగైన పట్టణ ప్రజారోగ్యం కోసం అలాంటి పరిస్థితుల కల్పనపై
ఇదే విషయమై పట్టణ మాంసం కేంద్రాల తనిఖీలో గుర్తించిన అంశాలన్నీ జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి ద్వారా జిల్లా కలెక్టర్ కి నివేదించడం జరుగుతుంది అని తెలిపారు.తనిఖీ కార్యక్రమములో అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు మున్సిపల్ పారిశుధ్య అధికారులు రాజయ్య, బాబూరావు, ఆనందరావు, సిబ్బంది జవాన్ లు తదితరులు పాల్గొన్నారు.



