Saturday, January 24, 2026
[t4b-ticker]

పరుగుల వీరుడుకి ఘన సన్మానం….

పరుగుల వీరుడుకి ఘన సన్మానం….

అంతర్జాతీయ స్థాయి క్రీడారంగం లో రాణించాలి….

బాయ్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థికి ఘన సన్మానం….

:మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్,

Mbmtelugunews//కోదాడ, జనవరి 08(ప్రతినిధి మాతంగి సురేష్):పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలర ఉన్నత పాఠశాలలో ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించిన పాఠశాల పూర్వ విద్యార్థి సతీష్ కు గురువారం ఘనంగా అభినందన సన్మానం చేయడం జరిగింది. కోదాడ మండల విద్యాధికారి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి. సలీం షరీఫ్, పాఠశాల మాజీ రిటైర్డ్ హెడ్మాస్టర్ ముత్తవరపు రామారావు సారధ్యంలో అభినందన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడినారు. ఇటీవల నేపాల్ లో జరిగిన అంతర్జాతీయ 100 మీటర్స్ రన్నింగ్ లో గోల్డ్ మెడల్ సాధించిన పరుగుల వీరుడు జడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ పూర్వ విద్యార్థి అనంతగిరి మండలం, వెంకట్రామపురం గ్రామ వద్దేబోయిన సతీష్ కి గోల్డ్ మెడల్, మెమొంటో, సర్టిఫికెట్, పుష్పగుచ్చం శాలువాలతో క్రీడాకారులు ఉపాధ్యాయులు విద్యార్థులు సమక్షంలో ఘనంగా సన్మానించినారు. మారుమూల గ్రామమైన వెంకట్రాంపురంలో జన్మించి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి 100 మీటర్ల రన్నింగ్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించటం విద్యార్థి తల్లిదండ్రులకు గ్రామానికి చదువుకున్న పాఠశాలకు రాష్ట్రానికి దేశానికి గర్వకారణం అని ముఖ్య అతిథి ముత్తవరపు రామారావు తెలిపారు. నేపాల్ లో జరిగిన అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనటానికి ఆర్థిక సహాయం అందజేసిన కత్రం ఫౌండేషన్ శ్రీకాంత్ రెడ్డి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ముత్తవరపు రామారావు, వెంకట్రాంపురం సర్పంచ్ జయరాజు అందించారని గోల్డ్ మెడల్ విజేత సతీష్ తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు, అభిరుచి గల క్రీడలలో రాణించాలని అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలని, ఈ సన్మాన కార్యక్రమాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని ఎండి సలీం షరీఫ్ కోరారు. సన్మాన కార్యక్రమంలో జాతీయ క్రీడాకారులైన కళ్యాణ్, సాయిరాజ్, నామ నరసింహారావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు బాగ్దాద్,ఎలెక్సి, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, వీర బ్రహ్మచారి, కాజా మియా, పాండురంగ చారి, బడుగుల సైదులు, సునీల్, కనకమ్మ, జాఫర్, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular