పర్యావరణం పరిరక్షణ అవగాహన ర్యాలీ……
:విద్యార్థి దశ నుండే పర్యావరణం,వాతావరణం పట్ల అవగాహన పెంచుకోవాలి…
:కోదాడ మండలం విద్యాధికారి ఎండి సలీం షరీఫ్.
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 20(ప్రతినిధి మాతంగి సురేష్):సోమవారం కోదాడలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు,ఉపాధ్యాయులు పర్యావరణం,వాతావరణం అవగాహన ర్యాలీ నిర్వహించారు.కోదాడ మండల విద్యాధికారి,బాయ్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్ ర్యాలీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినారు.ఎన్జిసి నేషనల్ గ్రీన్ కార్ప్స్.(జాతీయ ఆకుపచ్చ సైనిక దళం) కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పర్యావరణం వాతావరణం విషయాలపట్ల అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించడం జరిగిందని, సూర్యాపేట జిల్లాలో ఎన్జిసి కార్యక్రమం క్రింద సూర్యాపేట జిల్లాలో బాయ్స్ హై స్కూల్ కోదాడ తో పాటు,మొత్తం 13 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.

ఎంపిక చేయబడిన పాఠశాలలలో పచ్చదనం,పరిశుభ్రత,కిచెన్ గార్డెన్ ఏర్పాటు పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎల్ దేవరాజు,పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ,ఉపాధ్యాయులు బడుగుల సైదులు,కనకమ్మ,ముక్తార్,వీర బ్రహ్మచారి,అశోక్ గౌడ్,రవి,విద్యార్థులు పాల్గొన్నారు.