పర్యావరణ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
Mbmtelugunews//కోదాడ, మార్చి 28(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక కెఆర్ఆర్ .ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోదాడలో ఎకోక్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఆర్గానిక్ ఫుడ్ పెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా.హదాసరాణి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ మానవులంతా ప్రకృతికి దగ్గరగా జీవించాలని ప్రతిఒక్కరు మొక్కలు పెంచాలని, నీటిని వృథా చెయ్యొద్దని బావితరాలకు కాలుష్యం లేని సమాజాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిమీద ఉందని ప్రసంగించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆర్మీ ఫోర్స్ అధికారి శ్రీరామ్, ఉస్మానియా యూనివర్సిటీ నుండి పీహెచ్డీ పరిశోధకుడు గోపాల్, ప్రముఖ సాహితీ వేత్త కృష్ణమూర్తి పాల్గొన్నారు.కళాశాల విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో పర్యావరణ రహిత వస్తువులను, ఆహార పదార్థాలను ప్రదర్శించారు. గాలిని నీటిని నిప్పును అడవులను రక్షించాలని విద్యార్థులు వివిధ పర్యావరణ రహిత ప్రాజెక్ట్ లను ప్రదర్శించారు. అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపాల్, ఎకోక్లబ్ కన్వీనర్ మాట్లాడుతూ ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని మనిషి ఆధునికత పేరుతో ధ్వంసం చేస్తున్నాడని కాపాడుకోవలసిన భాధ్యత మనందరిమీద ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.



