కోదాడ,మార్చి 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:చిలుకూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని కోదాడ ఆర్డీవో ఆర్ సూర్యనారాయణ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ధరణి ఫైల్ ను పరిశీలించారు.పెండింగ్ ఉన్న సమస్యల పై స్ధానిక ఎమ్మార్వో, సిబ్బంది తో సమీక్ష నిర్వహించారు.ధరణి సమస్యలు పెండింగ్ లో లేకుండా చూడాలన్నారు.ఎమ్మెల్సీ,ఎంపీ ఎన్నికల ఓటరు జాబితా తయారీ పై సమీక్ష నిర్వహించారు.

అనంతరం రాష్ట్రంలో జరగబోయే ఎంపీ,ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా తయారీ పై కోదాడ ఆర్డీవో ఆర్ సూర్యనారాయణ బుధవారం మునగాల తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది తో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలం లో అన్ని గ్రామాల్లో ఎన్నికల జాబితా లో గతంలో జరిగిన దోషాలు తిరిగి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అనంతరం ధరణి సమస్యల ను పరిశీలించారు.ధరణి దరఖాస్తులు పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో స్ధానిక ఎమ్మార్వో సిబ్బంది ఉన్నారు.



