పల్లె చుక్కయ్యను పరామర్శించిన మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి…
5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేత…
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 16 (ప్రతినిధి మాతంగి సురేష్)కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అనంతగిరి మండలం వెంకట్రాపురం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పల్లె చుక్కయ్యను కాంగ్రెస్ పార్టీ అనంతగిరి మండల అధ్యక్షుడు ముసుకు శ్రీనివాస్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఇటీవల కాలుకు చికిత్స కావడంతో, వారి కుటుంబాన్ని పరామర్శించి, ఖర్చుల నిమిత్తం 5000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హామీ ఇవ్వమన్నట్లుగా చుక్కయ్యకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే సహకారం, చొరవతో భవిష్యత్తులో పార్టీ పరంగా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట మాజీ సర్పంచ్ వేదాంతరావు,వెంకన్న,ఖానాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు కనగాల వీరయ్య తదితరులు పాల్గొన్నారు.