పశుపోషకులు క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: సర్పంచ్ పాలకి సురేష్
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 04( ప్రతినిధి మాతంగి సురేష్): పశుపోషకులు పశువుల క్యాంపును సద్వినియోగం చేసుకొని పాలు పశువుల ఉత్పత్తిని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దొరకుంట సర్పంచ్ పాలక సురేష్ అన్నారు. మండల పరిధిలోని దొరకుంట గ్రామంలో పశుగణాభివృద్ధి ఆధ్వర్యంలో పశువులకు క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పాలక్ సురేష్, ఉప సర్పంచ్ పత్తిపాక రమాదేవి పాల్గొని క్యాంప్ ని ప్రారంభించారు. ఈ క్యాంపు కి కోదాడ మండల పశువైద్యాధికారి డాక్టర్ పెంటయ్య, డాక్టర్ మధు, కాపుగల్లు పశువైద్యాధికారి డాక్టర్ సురేందర్, వి ఎల్ వో అరుణ పాల్గొని పశువులకి క్యాంపు నిర్వహించడం జరిగినది. క్యాంపులో 50 పశువులకు గర్భకోశ వ్యాధి నివారణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపర్వైజర్ మాదాస్ సైదులు, గోపాలమిత్రలు కళ్యాణి, ప్రసాద్, శెట్టి నాంచారయ్య, ఆదినారాయణ, గోపాలరావు, నజీర్, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



