పశువుల మందులను విరాళమిచ్చిన నియోస్పార్క్ పశువుల మందుల కంపెనీ
:పశు ఔషద బ్యాంక్ తో పశువులకు ఆరోగ్యం.
:పశుపోషకులకు ఆదాయం
వినియోగదారులకు ఆరోగ్య ఆహారం.
:దాతలకు పుణ్యం
అనే నినాదంతో కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో ఏర్పాటు చేసిన పశు ఔషధ బ్యాంక్ నకు.
మేము సైతం కొంత సాయం అంటూ నోరు లేని పశువుల ఆరోగ్య పరిరక్షణకు పశువుల మందులను విరాళ మెచ్చిన నియోస్పార్క్ కంపెనీ .
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 10(ప్రతినిధి మాతంగి సురేష్) ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య నిర్వహిస్తున్న “ పశు ఔషధ బ్యాంక్ “నకు చేయూతగా తమ కంపెనీ తరపున 26733/- రూపాయల విలువ గల మందులను నియోస్పార్క్ వెటర్నరీ మందుల కంపెనీ దక్షిణ తెలంగాణ ఏరియా మేనేజర్ చల్లా వెంకటేష్ పశు ఔషధ బ్యాంక్ నకు ఈరోజు విరాళంగా ఇచ్చారు.మూగజీవాల మందుల ద్వారా వ్యాపారం చేసే తమ కంపెనీకి అదే మూగజీవాలకు ఉచితంగా మందులను అందించి పశుసేవలో పాలు పంచుకునే అవకాశాన్ని కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల కల్పించిందని,మును ముందు కూడా పశు ఆరోగ్య సేవలో ముందుంటామని తెలిపారు.
పశుపోషకులకు వైద్య ఖర్చులను తగ్గిస్తూ,పశు ఆరోగ్యాన్ని అన్ని వేళలా కాపాడడానికి,పశుపోషణ పశుపోషకులకి భారం కాకుండా లాభసాటి చేయడంలో భాగంగా ఏర్పాటు చేసిన పశు ఔషధ బ్యాంక్ దాతల సహకారంతో సన్న చిన్న కారు పశుపోషకులకు ఉపయోగకరంగా ఉందని,ఔషధ బ్యాంక్ సేవలను గుర్తించి తమవంతుగా స్వతహాగా ముందుకు వచ్చి మందులను విరాళమిచ్చిన కంపెనీ దాతృత్వం అభినందనీయమని,మునుముందు ఔషధాల పరిధిని దాతల సహకారంతో మరింతగా విస్తృత పరచి పశుపోషకులకు చేయోటనివ్వడం జరుగుతుందని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు.కార్యక్రమంలో కంపెనీ శ్రేయాభిలాషులు అసిస్టెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డై శ్రీనివాస్ సిబ్బంది చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.