Sunday, July 6, 2025
[t4b-ticker]

పశువైద్యశాలల్లో సబ్సిడీ పై పశుగ్రాస విత్తనాలు –

పశువైద్యశాలల్లో సబ్సిడీ పై పశుగ్రాస విత్తనాలు –

:పశుగ్రాస కొరత నివారణకు ప్రభుత్వ ముందుచూపు

:పశుపోషకులకు పంపిణీకి సిద్ధం

:కిలోకి 98.89 రూపాయలు సబ్సిడీ
లో కేవలం 24.70 రూపాయలకే 5కిలోల సంచుల్లో లభ్యం

Mbmtelugunews//కోదాడ,మార్చి 28(ప్రతినిధి మాతంగి సురేష్):వేసవి లో వర్షాలు లేక,పచ్చిక బయళ్లలో పచ్చిక ఎండిపోయి భూములన్నీ బీడు పడి పశువులకి గ్రాసం కొరత ఏర్పడుతుంది. ఎండుగడ్డి ధరలు కూడా పైపైకి చేరుకుంటాయి.పశుగ్రాస కొరతను అధిగమించి పశుపోషకులు తమ పశువువలకి పచ్చి మేత అందించడం కోసం,నీటి వనరులున్న చోట మేలు జాతి పశుగ్రాసం పెంపకానికి 75 శాతం సబ్సిడీ పై అందించడానికి గడ్డిజొన్నలు అన్ని పశువైద్యశాలకి శుక్రవారం పంపిణీ చేయడం జరిగింది. కిలో ఒక్కంటికి 98.89 రూపాయలు విలువగల పశుగ్రాస విత్తనాలను అవసరం ఉన్న రైతులకు 75 శాతం సబ్సిడీ పై 24.70 రూపాయలకే అందించబడును.కోదాడ,హుజూర్ నగర్ నియోజక వర్గాలకు 2750 కిలోల విత్తనాలను కోదాడ పశువైద్యశాల నిల్వ కేంద్రంగా పంపిణీ చేసినట్టు అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య చెబుతూ నీటి వనరులున్న వారు,రబీ పంట కోయగానే ఆ తేమలోనే పశుగ్రాస విత్తానాలు చల్లుకుంటే మరో రెండు తడుల్లో బలమైన పచ్చిమేత వస్తుందని ఎకరానికి సరాసరి మూడు కోతల్లో 150-200 క్వింటాళ్ల టన్నుల పచ్చిమేత దిగుబడి అవుతుందని ఈ అవకాశాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకొని పశుగ్రాసాన్ని విరివిగా సాగుచేసుకొని తమపశువులకి బలమైన పచ్చిమేత అందించాలని సూచించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular