పశువైద్యుడి సేవలను అభినందించిన ప్రముఖ వైద్యులు డా, జాస్తి సుబ్బారావు
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 24(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలోని ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డా పి.పెంటయ్య పశువైద్యంలో చిన్న పెద్ద ప్రాణం అనే తేడా లేకుండా సమస్త జీవాలకు వినూత్నంగా వైద్యం అందిస్తూ జనరల్ మెడిసిన్, సర్జరీ, డెంటల్ ,ఆర్థోపెడిక్, కంటి, గైనక్, న్యూట్రిషన్ మొదలగు అన్ని విభాగాల్లో ప్రత్యేక శ్రద్ధతో సేవలు అందిస్తూ,సమస్యాత్మక కేసులు వచ్చినప్పుడు సంబధిత స్థానిక ఆర్థోపెడిక్ , డెంటల్ స్పెషలిస్ట్ లను సంప్రదిస్తూ అన్ని రకాల పశువైద్యసేవలను కోదాడలో అందించడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు డా, జాస్తి సుబ్బారావు అన్నారు. అంకితభావంతో మూగజీవాలకు సేవలందిస్తూ పశుపోషకులకు తలలో నాలుకలా పనిచేస్తున్న డా పి పెంటయ్యను అభినందించడానికే పశువైద్యశాలకు వచ్చానని పశువైద్యుడిని ప్రశంసించారు.

ఈ సందర్బంగా డా, సుబ్బారావు మాట్లాడుతూ వైద్యంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా పశు ఔషధ బ్యాంక్ ఏర్పాటు చేసి దాతల సహకారంతో పశువులకు ఉచిత మందుల ఏర్పాటు, పశుపోషణలో అత్యంత ముఖ్యమైన ఖనిజ లవణ మిశ్రమం,కాల్షియం, లివర్ టానిక్ లను కంపెనీ తయారీ ధరలకే పశుపోషకులకు అందిస్తూ పశుఆరోగ్యపరితక్షణతో పాటు పశుపోషకులకు పెట్టుబడి ఖర్చులు తగ్గిస్తూ రెండు నెలల్లో 50 లక్షల అదనపు సంపదను సృష్టించి పాడి రంగం లాభాల బాటలో సాగడానికి చొరవతీసుకొని పశుఔషధ బ్యాంక్ సేవలు అందించడం అభినందనీయమని అసిస్టెంట్ డైరెక్టర్ సేవలు మునుముందు మరింతగా విస్తృతమై రైతుల కు ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ తన వంతు సహాయంగా ఒకవేయి నూట పదహారు రూపాయల విరాళాన్ని పశు ఔషధ బ్యాంక్ నకు అందించారు. డా, పి పెంటయ్య మాట్లాడుతూ వైద్యరంగంలో కోదాడ ప్రముఖ వైద్యులు డా, జాస్తి సుబ్బారావు పశువైద్యశాలకు వచ్చి అభినందించడం, వెలకట్టలేని మరువలేని మధురానుభూతి అని పశుపోషకులకోసం ముగజీవాల ఆరోగ్య పరిరక్షణకు తాను సైతం వెన్నంటి ఉన్నానని పశు ఔషధ బ్యాంక్ నకు అమూల్యమైన విరాళం అందించి ప్రోత్సహించిన వారి ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



