Tuesday, December 23, 2025
[t4b-ticker]

పశుసంక్షేమ వారోత్సవాల

పశుసంక్షేమ వారోత్సవాల

:జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల భాగస్వామ్యం.

:పశువుల ఆరోగ్యమే మన ఆరోగ్యం…..

:జంతువులు సైతం మనలాంటి ప్రాణులే వాటికీ జన్మతః హక్కులుంటాయి అనే నినాదంతో.

:అలాంటి పశువుల హక్కులను కాపాడాలి:డి శ్రీనివాసరావు

Mbmtelugunews//కోదాడ,జనవరి 29 (ప్రతినిధి మాతంగి సురేష్)కోదాడ పట్టణం లో జంతు సంక్షేమ వారోత్సవాలు,పశుసంవర్ధక కార్యక్రమాలపై విద్యార్థులు,ఉపాధ్యాయులు,పశుసంవర్ధక అధికారులు సిబ్బందితో అవగాహనా ర్యాలీ నిర్వహించారు.అనంతరం జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాల ప్రాంగణం లో నిర్వహించిన సమావేశంలో
పశువైద్య,పశుసంవర్ధక సూర్యాపేట జిల్లా జాయింట్ డైరెక్టర్ డి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు.ప్రకృతి లో పర్యావరణ సమతుల్యతలో పశువులు కూడా ఒక భాగం అని,మనుషులు మాదిరిగానే వాటికి కొన్ని హక్కులు ఉన్నాయి అని విజ్ఞత,ఆలోచన పరిపక్వత కలిగిన మనుషులుగా జంతువుల ను ప్రేమతో సాకాలని వాటికి పరిశుద్ధ నీరు,మేత,వసతి,వైద్యం,పోషణ అందించాలన్నారు.

జంతువుల పట్ల ప్రేమను కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు.పశు సంపద మనుగడతోనే మానవ మనుగడని తెలిపారు.కెమికల్స్ తో కూడిన కలుషిత ఆహారం పశువులకు ఇవ్వకూడదని చెప్పారు.సమాజ అభివృద్ధిలో పశుసంపద కూడా ముఖ్యమన్నారు.ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా పై పెంటయ్య మాట్లాడుతూ నూటికి 98.7 శాతం ప్రజలం ఆహారంగా పశు ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటున్నామని మనం ఆరోగ్యంగా ఉండాలంటే పశువులు ఆరోగ్యంగా ఉండాలని,పశువుల్ని హింసించరాదని,రోడ్ల పై,చెరువులు కుంటల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయరాదని తద్వారా పశుల ప్రాణాలు కాపాడాలని సూచించారు.అలాగే అడవులు చెట్ల నరికివేతను అరికట్టి జంతువులు అడవులను వీడి జనావాసాల్లోకి రాకుండా చూడాలని,అలాగే ఊర్లలో ఎవరైనా పుట్టినరోజు వేడుకలు లేదా ఇతర కుటుంబ ఉత్సవాలు నిర్వహిస్తే ఆ ఖర్చులో కొంత మొత్తం పశువులకోసం విరాళంగా ఇచ్చినట్లయితే ఒక పశువు కి సహాయం చేసినా ఒక కుటుంబానికి సంవత్సర ఆదాయం వస్తుందని,జంతు ఆరోగ్య పరిరక్షణకు పేదవారి పశువుల ఆరోగ్యానికి ఉచిత మందుల కొరకు ప్రాంతీయ పశువైద్యశాలలో పశు ఔషధ బ్యాంక్ అందుబాటులో ఉందని జంతు ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జంతువులకు సేవచేయాలని సూచించారు.ఈ సందర్భంగా,నేటి సమాజంలో పశువుల పోషణ అంశంపై వ్యాచారచన పోటీ నిర్వహించి విజేతలుగా నిలిచిన బాయ్స్ హై స్కూల్ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.బి హరి (ప్రధమ),సిహెచ్ విన్ని (ద్వితీయ),పి హరీష్ కుమార్ (తృతీయ) కన్సోలేషన్ బహుమతులు,షేక్ సుహన,షేక్ సన,షేక్ మదీనా లు పొందారని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు డి మార్కండేయ,ఉపాధ్యాయులు బడుగుల సైదులు,ముక్తర్,వీర బ్రహ్మచారి,నరసమ్మ,బాలస్వామిచిలుకూరు,కోదాడ మండల పశువైద్యాధికారి డా మధు,డాక్టర్ రవి,డాక్టర్ వీరారెడ్డి,డాక్టర్ శ్రీనివాసరావు ,డా వినయ్,డాక్టర్ మధు,డాక్టర్ సురేంద్ర,సిబ్బంది చిరంజీవి, పోటు వెంకటేశ్వర్లు,శేషగిరి పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular