పాత కక్షలే గొడవకు కారణమా?
దీపావళి బాంబులతో రగిలిన గొడవ
సదర వ్యక్తులపై దాడి చేసి ఇంట్లో వస్తువులను పగలగొట్టిన వైనం
మైనర్ బాలుడుని గాయపరచడంతో గ్రామంలో ఉద్రిక్తత
Mbmtelugunews/హుజూర్ నగర్,నవంబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్):సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండల పరిధిలో దీపావళి పండుగ అంటే దీపాలు వెలిగించి ఇంట్లో కాంతులు వెదజల్లాలని పండగ జరుపుకుంటారు.కానీ దానికి విరుద్ధంగా పాత కక్షలు మనసులో పెట్టుకుని క్రాకర్స్ కాల్చుకునే సమయంలో దాడికి దిగి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసిన ఘటనతో ఒక్కసారిగా చింతలపాలెం మండలం ఉల్లిక్కి పడింది.వివరాల్లోకి వెళితే చింతల పాలెం మండలం పిక్లా నాయక్ తండ లో దీపావళి పండుగ రోజున ఇంటి లోకి చొరపడి వస్తువులను ధ్వంసం చేసి పలువురిపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.తండ లో దీపావళి పండుగ రోజు రాత్రి భూక్యా.రవీంద్ర ఇంటిపై మూకుమ్మడి దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.బాధితులు తెలిపిన వివరాల ప్రకారం….
దీపావళి పండుగ రోజున కొంతమంది యువకులు మా ఇంటి ముందు బాణసంచా కాలుస్తూ ఉండటంతో మీ ఇల్లు లు ఎక్కడ మా ఇంటి ముందు ఎందుకు కలుస్తున్నారు అని అడిగి పనిమీద బయటికి వెళ్ళిపోయాను.పాత కక్షలు మనసులో పెట్టుకుని కొంతమంది గ్రామానికి చెందినవారు నేను ఇంటిలో లేని సమయంలో మా ఇంటిలోకి చొరబడి మా ఇంటిలోని టివి ఫ్రీజ్ కారు ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేశారు అని వాపోయాడు.ఇంటిలోని వస్తువులను ధ్వంసం చేయడమే కాక నా కుమారులు అయిన మైనర్ బాలురను సైతం గొడ్డలితో దాడి చేయగా ఒకరికి తల పగిలింది అని మీడియా ఎదుట వాపోయాడు.ఇంటిపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడు భూక్యా పేర్కొన్నారు. ఇట్టి విషయమై చింతల పాలెం పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.