పాములతో పరేషాన్…
:అభివృద్ధికి ఆమడ దూరంలో ఇందిరమ్మ కాలనీ…
పట్టించుకోని పాలకులు…
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 17(మనం న్యూస్):అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రాపురం గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న ప్రజలు ప్రతిరోజు పాములతో బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతుల పెట్టుకొని జీవనం కొనసాగించాల్సి వస్తుందని అన్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పాములు దర్శనమిస్తూనే ఉన్నాయి. పగటి సమయంలో కంటికి కనిపిస్తాయి కాబట్టి ఏదో ఒక రూపంలో తప్పించుకుంటున్నామని, రాత్రి సమయంలో మాత్రం ప్రాణాలను అరిచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందని అన్నారు.

గతంలో పాము కాటుకు గురై ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కాలనీలో సుమారు 120 నివాస గృహాలు ఉన్నాయి ఆ గృహాలలో 300 ప్రజల నివాసం ఉంటున్నప్పటికీ అధికారులు కనీసం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదని, అంతేకాకుండా కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించుకున్న
ఫలితం లేకుండా పోయిందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కనీస సౌకర్యాలను మా కాలనీకి ఏర్పాటు చేయాలని వారు వేడుకుంటున్నారు..



