హుజూర్ నగర్,జూన్ 26 (mbmtelugunews):ప్రతినిధి మాతంగి సురేష్:సూర్యుని కంటే ముందే మేల్కొని చీపురు,కర్ర,పారా,గడ్డపార చేత పట్టి మురికి కాలువలను,వీధులను,గ్రామాలను శుభ్రం చేస్తూ ఉన్న పారుశుద్య కార్మికుల కష్టాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు వినపడడం లేదా? లేదా కనిపించడం లేదా? అని హుజూర్ నగర్ బీఎస్పి అసెంబ్లీ ఇన్చార్జ్ మందార రవి డిమాండ్ చేశారు.కనీసం వారి జీతాలు పెంచకుండా వారి జీవితాలతో చలగాటం ఆడుతున్నారు.కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన వారిలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ పారిశుద్ధ్య కార్మికులు ఏమైనా మీ సంపాదనలో వాటాలు అడిగారా? మీ నీళ్లు,నిధులు,నియామకాల లో కమిషన్లు అడిగార? ఎందుకు కనీసం వారిని పట్టించుకోకుండా,వారి గోస వినిపించుకోకుండా మీరు ఉంటున్నారు అని అన్నారు.వారికి మంచి జీతం,జీవిత బీమా వర్తింపజేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
(మీ ప్రాంతాలలో ఏమైనా వార్తలు ఉంటే ఈ నెంబర్ కు పంపించగలరు.9666358480)