పార్టీని వీడిన నేతలంతా తిరిగి వచ్చేయండి…..
:బిఆర్ఎస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం…….
:కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజల్లో నిరుత్సాహం………
:కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి సొంతగూటికి చేరుకున్న మాజీ కౌన్సిలర్ అలవాల అపర్ణ వెంకట్………
:సమిష్టిగా పని చేసి పార్టీని బలోపేతం చేద్దాం…….
:కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్……
కోదాడ,ఫిబ్రవరి 15(మనం న్యూస్):బిఆర్ఎస్ పార్టీని వీడిన నేతలంతా తిరిగి సొంతగూటికి రావాలని సమిష్టిగా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.శనివారం దుర్గాపురం లోని వారి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వార్డు కౌన్సిలర్ అలవాల అపర్ణ వెంకట్ కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలిచిన ఓడిన నిత్యం అందుబాటులో ఉండే నాయకుడి ని పోగొట్టుకున్నందుకు ప్రజలందరూ బాధపడుతున్నారని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అంటూ ఆత్రుతతో ఎదురు చూడడంతో పాటు పార్టీని వీడిన నాయకులంతా తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారని తెలిపారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సర్వేల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఎలా మభ్యపెడుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.పార్టీని వీడిన నాయకులంతా తిరిగి వచ్చేయాలని అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుదామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్,మామిడి రామారావు,కందుల చంద్రశేఖర్,కర్ల సుందర్ బాబు,ఇమ్రాన్ ఖాన్,సంగిశెట్టి గోపాల్,రామకృష్ణ,దొంగరి శ్రీను,అభిదర్ నాయుడు,కృష్ణ,వెంకటనారాయణ,హుస్సేన్,ఎలుగురి హరి,తిరపయ్య,మణికంఠ,భూమా నాగయ్య తదితరులు పాల్గొన్నారు.