పార్టీ కార్యాలయాలు ఉద్యమ కేంద్రాలు కావాలి.
:సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి సూచన.
Mbmtelugunews//చిలుకూరు,నవంబర్ 19 (ప్రతినిధి మాతంగి సురేష్):వామపక్షాల పార్టీ కార్యాలయాలు ప్రజా ఉద్యమ కేంద్రాలు కావాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు మునుగోడు మాజీ శాసనసభ్యులు,సూర్యాపేట జిల్లా సిపిఐ నిర్మాణ బాధ్యులు పల్లా వెంకటరెడ్డి అన్నారు.సోమవారం నాడు సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన కీసర గాంధీ స్మారకభవన్ (సిపిఐ కార్యాలయం)ను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నారాయణపురం గ్రామంలో పేద మధ్య తరగతి ప్రజల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమికి పొట్లాలు ఇవ్వాలని కీసర గాంధీ నాయకత్వంలో అనేక పోరాటం నిర్వహించి ఆ పట్టాల సాధనలో గుండాల చేతులు హత్యగావించబడ్డారని,సుమారు 200 పైగా పేద కుటుంబాలకు ఇండ్లు నిర్మించి ఇవ్వడంలో కీసర గాంధీది ప్రధాన పాత్రని ఆయన గుర్తు చేశారు.భారతదేశంలో 1925లో ఏర్పడ్డ సిపిఐ పార్టీకి సరిగ్గా శతవసంతాలు పూర్తి చేసుకున్నదని అధికారంలో లేకపోయినా చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉన్నా లేకపోయినా పేద ప్రజల సమస్యలే అజెండాగా పనిచేస్తున్న కార్యకర్తల బలమే కమ్యూనిస్టు పార్టీకి అండ అని ఆయన అన్నారు.సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్ మాట్లాడుతూ చిలుకూరు మండలంలో జరిగిన అన్ని ప్రజా ఉద్యమాలలో కీసర గాంధీ ప్రముఖ పాత్ర పోషించారని ఆయన స్మారకార్థం పార్టీ కార్యాలయం నిర్మించుకోవడం అభినందనీయం అని ఆయన అన్నారు.సిపిఐ సూర్యపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ప్రసంగించారు.తెలంగాణ సాయుధ పోరాట యోధులు దొడ్డ నారాయణరావు ప్రసంగించారు.ఈ కార్యక్రమానికి మండవ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యల్లావుల రాములు,మేకల శ్రీనివాసరావు ధూళిపాళ ధనుంజయ నాయుడు,పోకల వెంకటేశ్వర్లు,గుండు వెంకటేశ్వర్లు,బూర వెంకటేశ్వర్లు,నంద్యాల రామిరెడ్డి,దొడ్డ వెంకటయ్య,చేపూరి కొండలు,కీసర గాంధీ కుమారులు కీసర వెంకటేశ్వర్లు,నాగరాజు,శాఖ కార్యదర్శి కందుకూరి శ్రీను,యల్లావుల రమేష్ ప్రజానాట్యమండలి కళాకారులుతదితరులు పాల్గొన్నారు