కోదాడ,జులై 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నామనే అసత్య ప్రచారాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం బాబు హెచ్చరించారు.గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీలోని కొందరు ముఖ్య నాయకులు తమ పబ్బం గడుపుకునేందుకు,మేము,శశిధర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీకి మారుతున్నట్టుగా మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజల్లో అలజడి సృష్టిస్తున్నారని,అసత్య ప్రచారాలు మానుకోవాలని ఘాటుగా స్పందించారు.పార్టీ మారుతున్నామని విషయాన్ని ఖండిస్తూ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు చేస్తున్న అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం పార్టీ మారుతున్నామనే విషయాన్ని తెరమీదకి తెస్తున్నారని అన్నారు.ఈ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమం మొదలుకొని నేటి వరకు పార్టీ అభివృద్ధికి కృషి చేసిన శశిధర్ రెడ్డి,జడ్పిటిసిలు ఎంపీపీలు సర్పంచులు వారందరూ టిఆర్ఎస్ లోనే ఉండి వచ్చే ఎన్నికల్లో టికెట్ తెచ్చుకొని విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు చెప్పే మాటలు నమ్మి మీడియా వారు అసత్య ప్రచారాలు మానుకోవాలని. మీ దృష్టికి ఏవైనా విషయాలు వస్తే నేరుగా మమ్మల్ని సంప్రదించిన తర్వాతే వార్తా ప్రసారాలు జరపాలని మీడియా మిత్రులను కోరారు.విలేకరుల సమావేశంలో చిలుకూరు జెడ్పిటిసి బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు,మున్సిపల్ కౌన్సిలర్లు గుండపనేని పద్మా నాగేశ్వరరావు,తిపిరిశెట్టి సుశీల రాజు,రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు రాయపూడి వెంకటనారాయణ,రామినేని సత్యనారాయణ,సుంకరి నాగయ్య,హసన్ అలీ,రామాచారి,నాగేశ్వర్రావు,సలిగాంటి లక్షణ,కంచుకొమ్ముల శంకర్ తదితరులు పాల్గొన్నారు..
పార్టీ మారుతున్నామనే అసత్య ప్రచారాలు మానుకోవాలి..:పార్టీ కోసమే పని చేస్తున్నాం… అందరి మద్దతు మాకే ఉంది..
RELATED ARTICLES