చిలుకూరు,మార్చి 22(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కీత వెంకటేశ్వర్లు అన్నారు.శుక్రవారం చిలుకూరులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నహాక సమావేశంలో మాట్లాడారు.మండలం నుండి ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారీటీ రావాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్యంతో పని చేయాలని సూచించారు.

అనంతరం కోదాడ,హుజూర్ నగర్ లో ముమ్మరంగా చేస్తున్న అభివృద్ధి పనులను హర్షిస్తూ పార్టీ నాయకులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ప్లెక్సీకు పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ్ల ప్రశాంతి కోటయ్య,జడ్పిటిసి బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు,మాజీ ఎంపీపీ బజ్జురి వెంకటరెడ్డి,పార్టీ ప్రధాన కార్యదర్శి పిండ్రాతి హనుమంతరావు,చిలుకూరు గ్రామ శాఖ అధ్యక్షుడు షేక్ సోందుమియా,నాయకులు పుల్లారావు,వట్టికూటి నాగయ్య,ధనమూర్తి,సైదిరెడ్డి పాల్గొన్నారు.



