Saturday, July 5, 2025
[t4b-ticker]

పాలిటెక్నిక్,టిఎస్ఆర్ జెసి శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

పాలిటెక్నిక్,టిఎస్ఆర్ జెసి శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

:కోచింగ్ సెంటర్ ను ప్రారంభించిన ఆస్క్ అధ్యక్షరాలు బల్గూరి స్నేహ దుర్గయ్య.

Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 5 (ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక ఎమ్మెస్ కళాశాలలో అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్,టిఎస్ఆర్ జెసి కోచింగ్ ను శనివారం ఆస్క్ అధ్యక్షరాలు బల్గూరి స్నేహ దుర్గయ్య.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలుకూరు మండల విద్యాశాఖ అధికారి మాగి గురవయ్య పాల్గొని ముందుగా భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రాన్ని స్థాపించి గత 14 సంవత్సరాలుగా ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసుకున్న అన్ని వర్గాల విద్యార్థులకు నిరంతరంగా ఉచిత శిక్షణను అందజేయడం అభినందనీయమని తెలిపారు.

అదేవిధంగా విద్యార్థిని,విద్యార్థులు ఈ శిక్షణను ఉపయోగించుకొని మంచి ర్యాంకులు తెచ్చుకొని మంచి మంచి కళాశాలల్లో సీట్లు సాధించాలని కోరారు.ఆస్క్ అధ్యక్షురాలు బలుగూరి స్నేహ దుర్గయ్య మాట్లాడుతూ గత సంవత్సరం ఆస్క్ కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలో 24వ ర్యాంకును సాధించడం జరిగిందని అదేవిధంగా 1000 లోపు ఎక్కువ ర్యాంకులు సాధించడం జరిగిందనీ తెలియజేశారు.ఈ శిక్షణా కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా బోధించడంతోపాటుగా,ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా నియమించి ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని దీనితో పాటుగా స్టడీ మెటీరియల్ అందజేస్తున్నామని విద్యార్థులకు రోజువారి టెస్టులు నిర్వహించి విద్యార్థులు ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ను తక్కువ సమయంలో సమాధానం చేయగలిగే విధంగా తర్ఫీదు ఇస్తున్నామని తెలిపారు.ఆస్క్
ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్ఎస్పి ఏఈ బలుగూరి దుర్గయ్య,జూనియర్ లెక్చరర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నడిగూడెం ఆడెపు వెంకటేశ్వర్లు,రిటైర్డ్ ఏపీజీవీబీ మేనేజర్ కుడుముల స్వామి దాసు,అడ్వకేట్ జ్యోతి,కోర్స్ డైరెక్టర్ యలమర్తి శౌరి,కోర్స్ కో – ఆర్డినేటర్ గంధం బుచ్చారావు,నందిపాటి సైదులు,అమరబోయిన. వెంకటరత్నం,ఇరుగు కిరణ్ కుమార్,గంధం రంగారావు,చెరుకుపల్లి కిరణ్,గణిత ఉపాధ్యాయులు కన్నయ్య,ఫిజిక్స్ ఉపాధ్యాయులు షరీఫ్,కోర్స్ ఇన్స్ట్రక్టర్ మీసాల రవి,విద్యార్థిని విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular