పాలీసెట్- 2024 లో సత్తా చాటిన అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం (అస్క్)విద్యార్థులు
:రాష్ట్రస్థాయిలో 29 వ ర్యాంక్ ర్యాంకు సాధించిన కోదాడ విద్యార్థులు
కోదాడ,జూన్ 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:అంబేద్కర్ ఆశయ సాధన కేంద్రం( అస్క్) కోదాడ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ పొందిన విద్యార్థులు సోమవారం విడుదలైన ఫలితాలలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి సత్తా చాటారు.వీరిలో నూనె మణిదీప్ తండ్రి నాగేశ్వరరావు రాష్ట్రస్థాయిలో 117 మార్కులు సాధించి 29వ ర్యాంకును,గంధం స్రవంతి తండ్రి పండరీ బాబు 105 మార్కులు సాధించి 617 ర్యాంకును సాధించారు,కొంగ భవ్య శ్రీ 101 మార్కులు 1011 ర్యాంకు,గంజి రూప శ్రీ మార్కులు 93 ర్యాంకు 1529 ఇలా పదివేల లోపు 12 ర్యాంకులు సాధించడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులను ఆస్క్ వ్యవస్థాపకులు బల్గూరి దుర్గయ్య (ఏఈ ఇరిగేషన్)అధ్యక్షతన సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఆస్క్ అధ్యక్షురాలు బల్గూరి స్నేహ దుర్గయ్య మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో కష్టపడి చదివి మరిన్ని విజయాల సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆస్క్ ప్రధాన కార్యదర్శి మాతంగి ప్రభాకర్ రావు,అమరబోయిన వెంకటరత్నం,చేకూరి రమేష్,కోర్స్ కో-ఆర్డినేటర్ గంధం బుచ్చా రావు,చెరుకుపల్లి కిరణ్,కే శ్రీకాంత్,గంధం పండరి బాబు తదితరులు పాల్గొన్నారు.



