పాలేరు వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 30: సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల పరిధిలోని గొండ్రియాల గ్రామానికి చెందిన కిన్నెర ఉపేందర్ 23 సంవత్సరాల యువకుడు గురువారం పాలేరు వాగులో ముగ్గురు వ్యక్తులు పందెం కాసుకొని ఇద్దరు వ్యక్తులు బ్రిడ్జి పైనుండి వాగులోకి దూకగా ఒక వ్యక్తి బ్రిడ్జిపైనే ఉన్నాడు. దూకిన ఇద్దరి వ్యక్తులలో ఒక వ్యక్తి పైకి రాగలిగాడు కిన్నెర ఉపేందర్ అనే వ్యక్తి దూకిన మరుక్షణమే కనిపించకుండా వాగులో గల్లంతైన విషయం తెలిసిందే. గత మూడు రోజులుగా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు, పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టినారు. అయినా సరే ఆచూకీ లభ్యం కాలేదు ఈరోజు అనగా శనివారం ఉదయం రైతులు పోలాలకు వెళుతుండగా గొండ్రియల బ్రిడ్జికి కూత వేటు దూరంలో శవం తేలడం గమనించి గ్రామ ప్రజలకు తెలపగా వారు పోలీసు వారికి సమాచారం అందించి బాడీని వాగులో నుండి బయటకు తీశారు.



