పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం పట్ల క్రైస్తవుల ఆధ్వర్యంలో సంతాపం
Mbmtelugunews//కోదాడ,మార్చి 28(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక కట్ట బజార్ కోదాడ పిడబ్ల్యూఐ హోరేభూ ప్రార్థన మందిరం ఆవరణలో శుక్రవారం క్రైస్తవ నాయకుల పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం క్రైస్తవ లోకానికి తీరనిలోటు,వారి ఆత్మకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని పాస్టర్ సుందర్ రావు అన్నారు. క్రైస్తవ సమాజం కొరకు అలుపెరుగని పోరాటం చేసిన దైవజనుడు ప్రవీణ్ పగడాల అనాధల ఆశ్రయము నిర్వహిస్తూ వందల మందికి సహకారా అందిస్తున్న గొప్ప దైవజనుడు సేవకుల పక్షాన నిలబడి పోరాడిన గొప్ప యోధుడు తనకిచ్చిన వాక్ స్వాతంత్రముతో అనేక మంది దారి తప్పిన వారిని సరైన దారిలో పెట్టిన గొప్ప దైవజనుడు ఆయన అకాల మరణానికి కోదాడ క్రైస్తవులు అందరూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శిల్వే కొత్తపల్లి,రాజేష్,ప్రభుదాస్,జోసఫ్దే,దైవసహాయం,నెహెమ్యా,ప్రభుదాస్,రాహుల్ అనేకులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.