Monday, July 7, 2025
[t4b-ticker]

పెన్షన్ లబ్ధిదారులకు తప్పని తిప్పలు

పెన్షన్ లబ్ధిదారులకు తప్పని తిప్పలు

:గ్రామానికి రానీ పింఛన్‌ ఉద్యోగి

:మీరే రావాలి అని లబ్ధిదారులకు వార్నింగ్

:నేను వస్తే 70 రూపాయలు ఇవ్వాలని డిమాండ్

Mbmtelugunews//హుజూర్ నగర్/చింతలపాలెం,నవంబర్ 7 (ప్రతినిధి చింతారెడ్డి గోపిరెడ్డి ):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వృద్ధులు,వికలాంగులు ఒంటరి మహిళల కోసం అందిస్తున్న ఆసరా పెన్షన్ లు ప్రతినెలా అందుకోవడానికి లబ్దిదారులు అనేక తిప్పలు పడాల్సివస్తుంది.అభివృద్ధికి ఢోకాలేదనీ చెబుతున్నా నాయాకులు,అధికారులు ప్రభుత్వం అందించే అనేక పథకాలు లబ్దిదారులకు ఎంతో సులువుగా అందజేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే సరిపోతుందనీ పలువురు విమర్శలు చేస్తున్నారు.ప్రభుత్వం అందించే పింఛన్‌ డబ్బులు తీసుకోవడానికి లబ్దిదారులు కనీసం ఆటోల లో కూర్చోవడానికి,తమ సొంత వాహనాల్లో వెళ్లడానికి వికలాంగులు,వృద్ధులు అనేక అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.కొన్నిసార్లు పింఛన్‌ తీసుకోవడానికి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు.పింఛన్‌ డబ్బుల కోసం గ్రామాన్ని విడిచి చుట్టూ 50 కిలోమీటర్లు తిరిగి పింఛన్‌ డబ్బులు తెచ్చుకునే దుస్థితి నెలకొందని లబ్దిదారులు ఆవేదన చెందుతున్నారు.సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు కాలనీ నెమలి పూరి గ్రామం పంచాయతీ గా ఏర్పడి ఆరు సంవత్సరాలు అవుతున్న పించన్ లబ్ధిదారులు కోదాడ నియోజకవర్గం ద్వారకుంట వెళ్లి పింఛన్ తీసుకునే పరిస్థితి ఏర్పడ్డది,ఈ పులిచింతల గ్రామం 150 మంది లబ్ధిదారులు పించనకు అర్హులు కాగా ఇంతకుముందు వారు పులిచింతల ముంపు గ్రామంలో ఉండటం వలన ఆ గ్రామపంచాయతీకి సంబంధించిన ఆర్ అండ్ ఆర్ సెంటర్ కోదాడ మండలం ఏర్పాటు చేయగా అక్కడ వారు నివాసించడానికి అనుకూలంగా లేకపోవడం వలన వారు చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు దగ్గర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం వలన 2017-18లో ఆ ప్రాంతాన్ని గ్రామపంచాయతీగా ఏర్పాటు అయింది.అక్కడ కొన్ని కుటుంబాలు నివాస స్థావరాలు ఏర్పరచుకొని ఉంటున్న అక్కడ పింఛన్ ల లబ్ధిదారులు ప్రతినెల ఆటోలో కోదాడ మండలం ద్వారకుంట వెళ్లి పింఛన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.పింఛన్ ఇచ్చే అధికారి కి ఇక్కడికి వచ్చి ఒకరోజు పింఛన్ ఇవ్వమని చెప్పినా వారు వినకుండా ఇక్కడకు వస్తే ప్రతి మనిషి 70 రూపాయలు ఇవ్వాలి అనేది చెప్పటం తోటి లబ్ధిదారులు మాకు వచ్చేదే ఏమీ లేక మేము పెన్షన్ మీదనే ఆధార పడ్డాం అని వారిని వేడుకొనగా అయినా వారు ఎటువంటి మానవత్వం లేక అలా అయితే మీరు మా దగ్గరకు వచ్చే పింఛన్ తీసుకోవాలని చెప్పారు.గత్యంతరం లేక పింఛన్ కోసం లబ్ధిదారులు అందరూ అక్కడికే పోయి తీసుకుంటున్నారు, పోయే క్రమంలో ఆటోలు కానీ, సొంత వాహనాలలో కానీ తీసుకొని పోయేటప్పుడు అప్పుడప్పుడు ప్రమాదాల కు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని ఆ గ్రామ పెన్షన్ లబ్ధిదారులు మొత్తుకుంటున్నారు.కనుక ప్రభుత్వ అధికారులు స్పందించి మా పెన్షన్లు మా ఊర్లోనే ఇప్పించగలరని మొరపెట్టుకుంటున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular