పిట్లం ఎస్బిఐ ఏటీఎం గ్యాస్ కట్టర్ తో కట్ చేసి భారీగా నగదు చోరీ..
Mbmtelugunews//కామారెడ్డి, జనవరి 12(ప్రతినిధి ముజీబ్):కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో దొంగలు భారీ చోరీ చేసిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చోటో చేసుకున్నది.పోలీసులు,స్థానికుల కథనం మేరకు పిట్లం మండల పరిషత్ కార్యాలయం ముందు గల ఎస్బీఐ ఏటీఎంలో దొంగలు గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కట్ చేసి చోరికి పాల్పడ్డట్టు తెలిపారు.సినిమా తరహాలో కారులో వచ్చిన దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు.అధికారులు వస్తే గాని ఏటీఎంలో ఎంత డబ్బు చోరీకి గురయిందో తెలిసే అవకాశం ఉన్నదని వారు తెలిపారు.
అధికారులు వచ్చిన అనంతరం ఎంత డబ్బు చోరీకి గురైంది వెల్లడిస్తామని వారు తెలిపారు.కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.సీసీ టీవీ ఫుటేజ్ల ఆధారంగా చోరికి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ గౌడ్,రూరల్ సీఐ రాజశేఖర్,పిట్లం ఎస్సై రాజు,నిజాంసాగర్ శివకుమార్,వివిధ మండలాల పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.