కోదాడ,ఫిబ్రవరి 27(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పిడిఎస్ యు) జిల్లా నూతన కమిటీని మంగళవారం కోదాడ పట్టణంలోని లాల్ బంగ్లాలో జరిగిన జిల్లా జనరల్ బాడీ లో ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్భంగా పిడిఎస్ యు మాజీ కార్యదర్శి దారావత్ రవి,ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ జార్జిరెడ్డి,జంపాల స్ఫూర్తితో శాస్త్రీయ విద్యా విధానంకై,సమ సమాజ స్థాపన కోసం,అమరుల అందించిన స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రకటించారు.ప్రతినిధులు ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులుగా పుల్లూరు సింహాద్రి,ప్రధాన కార్యదర్శిగా మలోతు చందర్ రావు,ఉపాధ్యక్షులుగా భరత్,సహాయ కార్యదర్శిగా సుధాకర్,కోశాధికారిగా కామల్ల ఉదయ్,సభ్యులుగా రహీం,కిరణ్,గోపి,వేణు,కరణ్,సుమంత్ లను ఎన్నుకోవడం జరిగింది.



