పిడుగుపాటుకు పాడి గేదెలు మృతి
Mbmtelugunews//చిలుకూరు,సెప్టెంబర్ 21(ప్రతినిధి మాతంగి సురేష్):పిడుగు పాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షం,పిడుగు పాటుకు చిలుకూరు గ్రామంకు చెందిన కొండా ఎల్లయ్య ఇంట్లో చెట్టు కింద ఉన్న రెండు పాడి గేదెలు అక్కడిక్కడే మృతి చెందినాయి.మృతి చెందిన పాడి గేదెల విలువ రూ.1.60 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు.ఈ గేదెల పాడిద్వారానే కుటుంబం పోషణ జరుగుతుందని తెలిపారు. అదే గేదలు మరణించడంతో కుటుంబ పోషణకు ఇబ్బంది కలుగుతుందని కావున ప్రభుత్వం నాకు న్యాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
మీ ప్రాంతంలో ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి వాట్సాప్ ద్వారా పంపించగలరు.