పీఎం శ్రీ బాయ్స్ హై స్కూల్లో మహిళా ఉపాధ్యాయులకు సన్మానం….
నేటి బాలికల చైతన్యమే రేపటి మహిళా అభ్యున్నతి…..
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు….
Mbmtelugunews//కోదాడ,మార్చి 8 (ప్రతినిధి మాతంగి సురేష్)శుక్రవారం నాడు పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కోదాడ యందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు సిబ్బందిని పూలు,శాలువా, మెమొంటోలతో ఘనంగా సన్మానించడం జరిగింది.మార్చి 08న రెండవ శనివారం సెలవు దినం కావున శుక్రవారం నాడు నిర్వహించడం జరిగింది.కోదాడ మండల విద్యాధికారి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎండి సలీం షరీఫ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినారు. మహిళలు కార్యక్రమాలను స్పష్టంగా,వేగవంతంగా పూర్తి చేయగలుగుతారని కొనియాడినారు.నేటి బాలికలు చైతన్యంతో ఆలోచించి చదువుకుంటే,భవిష్యత్తులో మహిళాభ్యున్నతి సాధ్యమన్నారు. మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరం సహకరించాలని కోరారు.మహిళా ఉపాధ్యాయులు మీనాక్షి, పద్మావతి, హేమలత, కళ్యాణి, రేణుక,సునీల,రాణి,పద్మ పాఠశాల సిబ్బంది విజయ,అంజమ్మ,అరుణ ను సన్మానించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి మార్కండేయ సీనియర్ ఉపాధ్యాయురాలు వి.మీనాక్షి పాల్గొని మాట్లాడినారు.పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులకు,సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసినారు.