పుట్టిన ప్రతి బిడ్డకు గంటలోపే ముర్రుపాలు పట్టాలి:డి రమణ
కోదాడ,ఆగష్టు 03(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:పుట్టిన ప్రతి బిడ్డకు గంటలోపే తల్లి ముర్రుపాలు పట్టించాలి అలా పట్టించడం వలన పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ పెరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ డి రమణ అన్నారు.కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల గ్రామంలో అంగన్వాడి మొదటి సెంటర్ టీచర్ చెడపంగు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిమిర్యాల స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో వివి రామచంద్రరావు పాల్గొని తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు.అనంతరం ఏఎన్ఎం,ఆశాలను రెండు సంవత్సరంలోపు పిల్లల యొక్క బరువులు హెల్త్ కండిషన్స్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలకు,బాలింతలకు తల్లిపాలు అయిన ముర్రుపాల గొప్పతనం గురించి వివరించారు.పిల్లలకు ఆరు నెలల వరకు పాలు పట్టాలి ఆ తర్వాత మిగతా పౌష్టిక ఆహారాలతో పాటు రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వడం వల్ల ఆ పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.

ఈ రెండు సంవత్సరాలలో పిల్లల యొక్క బరువులను ప్రతినెల తప్పక అంగన్వాడి సెంటర్లలో చూయించుకోవాలని బరువు తగ్గిన పిల్లలకు పౌష్టికాహారాలు ఇవ్వాలని తెలిపారు.అనంతరం రెడ్లకుంట గ్రామంలోనే అంగన్వాడి సెంటర్ లో అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సిహెచ్ విజయలక్ష్మి,సునీత,పద్మ,చిమిర్యాల పంచాయతీ కార్యదర్శి కె వీరబాబు,రెడ్లకుంట హెడ్మాస్టర్ నరేష్,శ్రావణ్ కుమార్,కార్యదర్శి నాగలక్ష్మి,ఏఎన్ఎమ్ లు,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.