పురుగుల మందు తాగి పిఎసిఎస్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.
:ఒత్తిళ్లకు గురి చేయడమే కారణమా?
Mbmtelugunews//కోదాడ/నడిగూడెం ఫిబ్రవరి 03 (ప్రతినిధి మాతంగి సురేష్)పురుగుల మందు తాగి ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే నడిగూడెం మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బీరవెల్లి సుధాకర్ రెడ్డి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

బీరవల్లి సుధాకర్ రెడ్డి చెప్పిన వివరాలు మేరకు తనను గత ఆరు నెలలుగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని,నా డ్యూటీని నన్ను చేయనీయకుండా తనపై చేస్తున్న ఒత్తిడి వల్లనే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు.మెరుగైన వైద్యం కొరకు బాధితుడిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.