పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 13 (ప్రతినిధి మాతంగి సురేష్):మండల పరిధిలోని కాపుగల్లు ప్రాథమిక పాఠశాల 25 సంవత్సరాల జ్ఞాపకాలు నెమరు వేసుకున్న పూర్వ విద్యార్థులు కాపుగల్లు జడ్పిహెచ్ఎస్ లో 1999 2000 బ్యాచ్ 25 సంవత్సరాల తర్వాత తమ గత స్మృతులను నెమరు వేసుకునుటకు ఆదివారం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు.ఎక్కడెక్కడో వివిధ రంగాలలో వివిధ హోదాలలో స్థిరపడిన విద్యార్థులంతా ఒక గ్రూపుగా ఏర్పడి తమ చదువుకున్న పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అప్పటి తమకు బోధించిన ఉపాధ్యాయులను ఆహ్వానించి వారి చేత మరల పాఠాలు బోధించుకున్నట్లు క్లాస్ రూమ్ లో చేసిన విద్యార్థులు మధురస్మృతులను గుర్తుచేసుకొని ఆనందించారు.

తమను క్రమశిక్షణలో పెట్టడానికి తమ విద్యార్థులు దండించిన విధానాన్ని సమాజానికి సేవ చేసే విషయంలో వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తిని ఇప్పటికీ నాయకుడిగా వివిధ హోదాలలో ఉన్న వ్యక్తులుగా వాటిని నెరవేరుస్తున్నట్లు గుర్తు చేసుకుంటూ సాగిన ఈ కార్యక్రమం కొన్ని సరదా ఆటలతో ఉత్సాహాన్ని నింపింది..అలాగే కార్యక్రమంలో విద్యార్థులంతా తమ ఉపాధ్యాయులను సత్కరించి పాదాభివందనం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శేషాచారి,వీరయ్య,సత్యం,మధుసూదన్ రావు,శ్రీనివాసరావు,సుబ్బారెడ్డి,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు..



