పెట్టుబడులకు కొరియా సిద్ధం
టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలత ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ సమావేశం
తెలంగాణలో హ్యుందయ్ మెగా టెస్టింగ్ సెంటర్ విద్యుత్తు, గ్యాస్, బ్యాటరీల తయారీలో ఎల్ఎస్ కార్పొరేషన్..
అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు సమకూర్చాం
అన్నివిధాలా సహకరిస్తాం మా రాష్ట్రానికి రండి ప్రతినిధులతో సమావేశాల్లో ముఖ్యమంత్రి పిలుపు
Mbmtelugunews//హైదరాబాద్,ఆగస్టు 12 ప్రతినిధి మాతంగి సురేష్:అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రా మికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడం లో విజయవంతమైన సీఎం రేవంత్ రెడ్డి.. దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గత
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిం చినా.. పరిశ్రమలు రాని వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో దక్షిణ కొరియా నుంచి పెట్టుబడులను సాధించగలిగారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వం వారికి తెలిపింది.