పేకాటరాయుళ్లు పట్టివేత
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 17 (ప్రతినిధి మాతంగి సురేష్): అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతటి వారైనా చట్టరీత్యా చర్యలు తప్పవు అని రూరల్ ఎస్సై సిహెచ్ గోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామ శివారులో మద్యాహ్నం అందాజ 03 .00 గంటల సమయంలో జూ గుట్ట వద్ద కొంతమంది చట్ట విరుద్ధంగా డబ్బులను పందెంగా పెట్టి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లగా, అక్కడ కోదాడ పట్టణ పరిధిలోనే లక్ష్మీపురం కు చెందిన చెందిన 1) అల్వాల రామకృష్ణ తండ్రి అక్కయ్య, గుడిబండ గ్రామానికి చెందిన 2)షేక్ సత్తార్ , 3) అంబటి శ్రీనివాస్, తొగర్రాయి గ్రామానికి చెందిన 4) అమరబోయిన ఉపేందర్, 5) పగిడిమర్రి మధన్ మోహన్ ఐదుగురు మిగిలిన వారితో కలసి మూడు ముక్కల పేకాట ఆడుతుండగా వారిని పట్టుబడి చేసి, వారి వద్ద నుండి 37310 రూపాయల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు,నాలుగు మోటార్ సైకిల్ స్వాధీన పరుచుకొనయినది తెలిపారు. నలుగురు వ్యక్తులు అయిన అర్జున్, గోపయ్య, శివ, రవి నేరస్థలం నుండి పోలీస్ వారిని చూసి పారిపోయనారు. పై తొమ్మిది మందిపై కేసు నమోదు చేయనైనది. కోదాడ రూరల్ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లయితే తక్షణమే మాకు తెలియజేసి పోలీసు వారికి సహకరించాలని కోదాడ రూరల్ ఎస్సై సిహెచ్ గోపాల్ రెడ్డి తెలిపారు.



