పేకాట రాయుళ్లు ఆరెస్టు 9 మంది పై కేసు నమోదు
:58 వేలు నగదు..6 సెల్ఫోన్లు..5 బైక్లు సీజ్
కోదాడ,జులై 29(mbmtelugunewst)ప్రతినిధి మాతంగి సురేష్:చట్ట వ్యతిరేకంగా పేకాట ఆడుతున్న పేకాట రాయుళ్లును
పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆదివారం చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామంలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.మండలంలోని బేతవోలు గ్రామంకు చెందిన జిల్లా ప్రసాద్ ఇంట్లో పేకాట ఆడుతున్న చిలుకూరు గ్రామంకు చెందిన కొండా వెంకన్న, కొండా సతీష్,ముక్కా లక్ష్మినారాయణ,బేతవోలు గ్రామంకు చెందిన గౌరు ప్రసాద్,జువ్వాడి కోటేశ్వరరావు,యిట్టిమల్ల వీరస్వామి,జిల్లా సతీష్,హూజూర్నగర్ కు చెందిన చొప్పడి యర్రయ్య,గుండు సైదులు పేకాట ఆడుతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి వారి వద్ద నుండి రూ.58 వేల నగదు,6 సెల్ఫోన్లు,5 బైక్లు స్వాదీనం చేసుకొని సీజ్ చేసినట్లుగా ఎస్ఐ సురభి రాంబాబు తెలిపారు.చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడితే వారిపై చట్ట పరమైన కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.