హుజూర్ నగర్,ఆగష్టు 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పేద ధనిక అనే తారతమ్యాలు లేకుండా అందరము సమానమనే దానికి నిదర్శనమే యూనిఫామ్ అని మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు అన్నారు.స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు “ఏకరూప” దుస్తుల (యూనిఫామ్స్) పంపిణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర్ రావు,పాఠశాల పరిది వార్డు కౌన్సిలర్ దొంగరి మంగమ్మ హాజరై విద్యార్థినీ విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు.అనంతరం వైస్ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు హాజరై మంచిగా చదువు కోవాలని కోరినారు. పాఠశాలలో ఏకరుప్ప దుస్తులు వేసుకోవడానికి గల కారణం ఏమిటంటే అందరమూ సమానమే ఎవరు ఎక్కువ కాదు అనే ఉద్దేశంతోటే యూనిఫామ్ ను పాఠశాలలు ఏర్పాటు చేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అనేక సదుపాయాలు కల్పిస్తున్నది వాటిని సద్వినియోగం చేసుకొని మంచిగా చదివి తల్లిదండ్రులకు చదివిన పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మల్లెల ఉదయశ్రీ,పాద్యాయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి,మాతంగి ప్రభాకర్ రావు,ఉపేందర్,దీనారాణి,అరుణరాణి,శేషగిరి,అన్వేష్,వెంకటేశ్వర్లు,వసంతరావు,రవీందర్ రెడ్డి,అశోక్ కుమార్,జానీ బేగం,శేఖర్,మున్ని బేగం మరియు విద్యార్థులు పాల్గోన్నారు.
పేద,ధనిక అనే తారతమ్యాలు లేకుండా చూపించేదే యూనిఫామ్:జక్కుల నాగేశ్వరరావు మున్సిపల్ వైస్ చైర్మన్
RELATED ARTICLES