Sunday, February 22, 2026
[t4b-ticker]

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి….

పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి….

:ఎమ్మెల్యే పద్మావతి, మంత్రి ఉత్తమ్ సహకారం తో వైద్య శాల లో వసతుల కల్పనకు కృషి….

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 21( ప్రతినిధి మాతంగి సురేష్ ): పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నూతనంగా మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన ఎర్నేని కుసుమ బాబును సన్మానించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో వైద్యశాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి పేద ప్రజలకు ఉత్తమ సేవలందించి పేరు సాధించాలన్నారు. కాగా మున్సిపల్ చైర్ పర్సన్ తో పాటు కౌన్సిలర్లు తోట జ్యోతి శ్రీనివాస్, జిల్లేపెల్లి నాగేశ్వరరావు లను సన్మానించారు. అనంతరం ఆశా కార్యకర్తలకు చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్, సిబ్బంది, మహిళా నాయకులు పబ్బ గీత తదితరులు ఉన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular