కోదాడ,అక్టోబర్ 31(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:ఈనెల నవంబర్ లో జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రియాంక అన్నారు.మంగళవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతుల రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రియాంక పాల్గొని మాట్లాడుతూ ఈ సార్వత్రిక ఎన్నికలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు ముందుగానే తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా నిర్వర్తించాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్వో సూర్యనారాయణ,మండల స్పెషల్ ఆఫీసర్లు తాసిల్దార్ లు,ఎంపీడీవోలు,మున్సిపల్ కమిషనర్,సెక్ట్రోల్ ఆఫీసర్స్,పంచాయతీ సెక్రెటరీలు,రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి:అడిషనల్ కలెక్టర్ ప్రియాంక
RELATED ARTICLES



