పోషణ అభియాన్ లో భాగంగా తల్లిపాల వారోత్సవాలు
కోదాడ,ఆగష్టు 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:పోషణ అభియాన్ లో భాగంగా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తమ్మరబండపాలెం గ్రామం నందు అంగన్వాడి మొదటి సెంటర్ లో తల్లిపాల వారోత్సవాలు శుక్రవారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ డి రమణ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీనిలో భాగంగా తల్లి పాలు మొట్టమొదటిగా వచ్చే ముర్రుతల్లిపాలను బిడ్డకు పట్టించడం వల్ల జరిగే లాభాలు గర్భిణీలకు బాలింతలకు వివరించారు.
కేవలం 6 నెలలు తల్లిపాలు మాత్రమే బిడ్డకు పట్టించడం ఆరు నెలల తరువాత అదనపు ఆహారంతో పాటు బిడ్డకు పెట్టుకుంటూ రెండు సంవత్సరాలు వచ్చేంతవరకు తల్లిపాలును కొనసాగించాలి.బరువు తక్కువగా విన్న పిల్లలను గుర్తించి పిల్లల బరువులు తీసి తక్కువ బరువును సామ్యంగా గుర్తించడం జరిగింది.ఈ కార్యక్రమానికి గ్రామములోని తల్లులు,ఆశలు,ఏఎన్ఎం రజియా,అంగన్వాడీ టీచర్స్ వెంకటరమణ,లాల్ బి, జాన్ బీ,రమ తదితరులు పాల్గొన్నారు.