కోదాడ,ఆగష్టు 02(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మహారాష్ట్ర కు చెందిన 29 సంవత్సరాల రాబిన్ సన్ ఫెర్నాండీస్ అనే వ్యక్తి గంజాయి సరఫరా,రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించారు,నిందితుడు గంజాయితో పారిపోతుండగా వెంబడించిన మునగాల పోలీసు సిబ్బంది రాబిన్ సన్ ఫెర్నాండీస్ ను అదుపులోకి తీసుకుని 120 కేజీల గంజాయిని సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగినది.నిందితుడు మళ్ళీ ఇలాంటి నేరానికి పాల్పడవద్దు అనే ఉద్దేశ్యంతో అతని పై పిడి యాక్ట్ ( తెలంగాణ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ) అమలు చేసి జైలుకు తరలించడం జరిగినది.ఇక ముందు ఎవరైనా మత్తు పదార్ధాలు,మాదకద్రవ్యాలు రవాణా చేసిన,సరఫరా చేసిన,కలిగి ఉన్న,వ్యాపారం చేసిన మరియు ప్రజా ఆరోగ్యానికి,ఆహార భద్రతకు,ప్రజా వ్యవస్థకు భంగం కలిగించినా అలాంటి వారిపై పిడి యాక్ట్ అమలు చేయడం జరుగుతుంది అని ఎస్పీ హెచ్చరించారు.పిడి యాక్ట్ నమోదైన నిందితుడిని మునగాల సర్కిల్ సిఐ రాఘవులు, అధ్వర్యంలో ఎస్ఐ లోకేష్,సిబ్బంది హైదరాబాద్ లోని చంచల్ గూడ సెంట్రల్ జైల్ నందు అధికారులకు అప్పగించడం జరిగినది.నిందితుడు ఒక సంవత్సరం పాటు జైలులో ఉంటాడు.కేసులో బాగా పని చేసిన సిబ్బందిని ఎస్పి అభినందించారు
పౌర సమాజానికి విఘాతం కలిగించే మరియు ప్రజల ఆరోగ్యాన్ని నష్టం కలిగించే నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన శిక్షలు శిక్షలు తప్పవు:ఎస్.రాజేంద్రప్రసాద్ ఐపిఎస్,ఎస్పీ సూర్యాపేట
RELATED ARTICLES