కోదాడ,ఫిబ్రవరి 24(mbntelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక తేజ పాఠశాలలో వృక్షో రక్షిత రక్షితః అనే కార్యక్రమం విద్యార్థుల అవగాహన నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తేజ పాఠశాల డైరెక్టర్ జానకిరామయ్య పాల్గొని మాట్లాడుతూ సమస్త జీవకోటికి ప్రకృతి అమ్మ ఒడి లాంటిది,పంచభూతాల నడుమ జీవకోటి మనుగడ కొనసాగుతుంది అని అన్నారు.గాలి,నీరు భూమి,ఆకాశం,అగ్ని నడుమ మేధావైన మనిషి జీవనం కొనసాగిస్తున్నాడు అని అన్నారు.ఈ ప్రపంచంలో దేనినైనా సృష్టించుకోవచ్చు గాని పంచభూతాలను సృష్టించడం ఎవరితరం కాదు,ప్రకృతిని బాధ్యతగా రక్షించుకోవాలంటే కచ్చితంగా దీనిని విరుగుడుగా ఏదో ఒకటి శరణ్యం వృక్షాలను నాటటమే,అందుకే వృక్షో రక్షతి రక్షితః అని అన్నారుపెద్దలు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని ఏ విధంగా రక్షిస్తుందో,అదే విధంగా పరోపకారాన్ని చేసే వృక్షాన్ని కాపాడితే అందరికీ ఉపకారమే కదా! ప్రకృతిని సంరక్షించే బాధ్యతగా చెట్లను నాటి బాధ్యతను విస్మరించకుండా ప్రతి ఒక్కరూ ప్రకృతికి ఆధార భూతమైన వృక్షాన్ని సంరక్షించుకోవాలి.వాటికి సకాలంలో బాధ్యతగా నీరు అందించినట్లయితే భావితరాలకు ప్రకృతి అందించే అమూల్యమైన కానుక చెట్లను బ్రతికించడం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం.అప్పారావు,ఉప ప్రధానోపాధ్యాయులు సోమనాయక్,సెక్రెటరీ సంతోష్ కుమార్,ఇన్చార్జులు రామ్మూర్తి,ఝాన్సీ,ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రకృతికి రక్షణ కవచమే వృక్షం
RELATED ARTICLES



