:కోదాడ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా……
:40 కోట్లతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పద్మావతి శంకుస్థాపన.
కోదాడ,ఫిబ్రవరి 23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి తెలిపారు.శుక్రవారం కోదాడ పట్టణ పరిధిలోని సుమారు 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల తో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా పట్టణంలోని విజయవాడ హైవేను అనుకొని దుర్గాపురం, కోమరమండ వై జంక్షన్ ల వద్ద స్వాగత ఆర్చి నిర్మాణానికి కోటి రూపాయల పనులకు, శ్రీరంగపురం, బాలాజీ నగర్ లో 2 కోట్ల 86 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి, ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద కూడలి అభివృద్ధికి 50 లక్షల రూపాయలతో, చెరువు కట్ట సుందరీకరణకు 8 కోట్ల రూపాయలతో, శ్రీమన్నారాయణ కాలనీలో అమృత్ 2.0 పథకం కింద త్రాగునీటి కొరకు 25 కోట్ల 80 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని 18 వ వార్డులో 8 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను, ఆరో వార్డులో 4 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును , శ్రీమన్నారాయణ కాలనీలో 6 లక్షలతో నిర్మించిన పార్కు ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని నిధులైన తీసుకువచ్చి మోడల్ పట్టణంగా తీర్చిదిద్ది ఒక ప్రణాళిక ప్రకారం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు,ఆర్డీవో సూర్యనారాయణ,డీఎంహెచ్వో కోటాచలం,మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల.కోటేశ్వరరావు,నాయకులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,వంగవీటి. రామారావు,పార సీతయ్య,కౌన్సిలర్లు కర్రీ శివ సుబ్బారావు,గంధం యాదగిరి, షాబుద్దీన్,కట్టెబోయిన జ్యోతి, శ్రీనివాస్ యాదవ్,సుశీల,రాజు, కోటిరెడ్డి,లెంకల రమా నిరంజన్ రెడ్డి,కందుల చంద్రశేఖర్,పుల్లారెడ్డిడాక్టర్ సుబ్బారావు,పబ్బా గీత,కమిషనర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
మీ ప్రాంతంలోని ఏమైనా సమాచారం ఉంటే ఈ నెంబర్ 9666358480 కి పంపించగలరు



