Thursday, March 26, 2026
[t4b-ticker]

ప్రచారం స్పీడ్ పెంచిన ఫుట్ బాల్

ప్రచారం స్పీడ్ పెంచిన ఫుట్ బాల్

:2,3,4 వార్డులలో ముమ్మర ప్రచారం

:ఫుట్ బాల్ గుర్తుపై ఓటు వేసి బల్గూరి స్నేహను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం.

Mbmtelugunews//కోదాడ, డిసెంబర్ 07: మండల పరిధిలోని గణపవరం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి బల్గూరి స్నేహ గ్రామంలో రెండు, మూడు, నాలుగు వార్డులలో వార్డు మెంబర్లు మోత్కూరి శ్రీనివాస చారి, ఆత్కూరి స్పందన వీరేష్, పిడమర్తి రమాదేవి వెంకట్రావుల ఆధ్వర్యంలో ఆదివారం ముమ్మర ప్రచారం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి బల్గూరి స్నేహ మాట్లాడుతూ ఫుట్ బాల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని అన్నారు. గ్రామంలో కులమతాలకు, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి నా వెంట నడుస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో ప్రధాన సమస్యలను ఎజెండాగా తీసుకొని గ్రామ పెద్దలతో చర్చించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతానని అన్నారు. ప్రచారంలో భాగంగా హమాలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో ముచ్చటించారు. ప్రచారంలో యువత, గ్రామ పెద్దలు, ప్రజలలో మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈర్ల శ్రీనివాసరెడ్డి, బండి చిన్న కోటయ్య, అమరబోయిన లక్ష్మయ్య యాదవ్, చామకూరి గురువయ్య, సానికొమ్ము తరుణ్ రెడ్డి, కొండా ధనమూర్తి, గాయం రవీందర్ రెడ్డి, పిడమర్తి సూర్యనారాయణ, సామ్రాజ్యం, అసానమ్మ, కుమారి, రాఏలు, తిరపతమ్మ, సంతోషం, వజ్రమ్మ, లచ్చమ్మ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular