కోదాడ,ఫిబ్రవరి 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న 25.44 లక్షల మంది దరఖాస్తుదారులపై కనీసం లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.20వేల కోట్ల వరకు భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని,ఎలాంటి చార్జీలు లేకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 6న రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.ఇందులో భాగంగా కోదాడ నియోజకవర్గ కేంద్రంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నామని మాజీ శాసనసభ్యులు,భారత రాష్ట్ర సమితి కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజలపై 20వేల కోట్ల భారం మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరసనగా కార్యక్రమం
RELATED ARTICLES



