కోదాడ,నవంబర్ 17(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:ప్రజల చూపు సింహం వైపు చూస్తున్నారు,కోదాడ నియోజకవర్గం లో ప్రజలు తెలంగాణ ఉద్యమకారుల వైపు చూస్తున్నారు అవకాశవాదాలను తరిమికొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి డా,, అంజి యాదవ్ అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మునగాల మండలంలోని మునగాల,గణపవరం,తిమ్మారెడ్డిగూడెం,కొక్కిరేణి,తాడవాయి,వెంకటరాంపురం గ్రామాలలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ ప్రజలు ఈ సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారుల వైపు ముగ్గు చూపుతున్నారని అన్నారు.రానున్న ఎన్నికలలో అవకాశ వాదులకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో నలమాల హరీష్,తోట కమలాకర్,కతిమాల వెంకన్న,వెంకటేష్,బాల,వీరబాబు,పవన్ తదితరులు పాల్గొన్నారు.



