Tuesday, January 14, 2025
[t4b-ticker]

ప్రజల పక్షాన పోరాటమే పొన్నమన్న ఆరాటం..

- Advertisment -spot_img

ప్రజల పక్షాన పోరాటమే పొన్నమన్న ఆరాటం..

:బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమాలు.

:పీపుల్స్ వార్ నుంచి..బీఎస్పీ వరకు రాజకీయ ప్రస్థానం కొనసాగింపు.

Mbmtelugunews//జయశంకర్ భూపాలపల్లి,జనవరి 13(ప్రతినిధి మాతంగి సురేష్):గౌడ సామాజిక వర్గంలో పుట్టి..సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న పులిబిడ్డ పొన్నం బిక్షపతి గౌడ్ చిన్నప్పటి నుంచే తిరుగుబాటు తత్వాన్ని పునికి పుచ్చుకున్నాడు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన పొన్నం మణెమ్మ-మొండయ్య దంపతులకు అక్టోబర్ 10, 1974న జన్మించాడు.చిన్నప్పటి నుంచే సోషలిజం భావాలను అలవర్చుకున్న ఆయన పదవ తరగతి వరకు విద్యనుభ్యసించాడు.చదువుకునే రోజుల్లోనే నిషేధిత పీపుల్స్ వార్ పార్టీకి ఆకర్షితుడై ఆ పార్టీకి సానుభూతిపరుడుగా పనిచేశారాయన.తండ్రికి ఆసరాగా వ్యవసాయం చేసుకుంటూ..గీతా వృత్తిని నేర్చుకున్నాడు. సమాజంలో జరుగుతున్న అవినీతిని, బహుజన సమాజంపై అగ్రవర్ణాలు చేస్తున్న పెత్తనాన్ని ఎదిరించడంలో పొన్నం బిక్షపతి గౌడ్ దిట్ట. బడుగు,బలహీన వర్గాల ప్రజలకు జరుగుతున్న అన్యాలను ఎదిరించడం,బహుజనుల హక్కుల కోసం పోరాటం చేయడంతో ఆయన ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నాడు. అడుగుతే వచ్చేది బిక్షం..పోరాడితే వచ్చేదే రాజ్యాధికారమంటూ బహుజన సమాజాన్ని చైతన్యం చేస్తూ..బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసేందుకు సన్నద్ధం చేస్తున్నాడు.ఈ దశలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ నాయకత్వంలో 2021లో బీఎస్పీ పార్టీలో చేరాడు.అనంతరం బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జిగా,జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ బహుజనులను ఏకం చేయడం కోసం నిరంతరం ఆయన కృషి చేస్తున్నాడు.అలాగే గత 5 సంవత్సరాలుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మోకు దెబ్బ గౌడ సంఘం జిల్లా అధ్యక్షునిగా,రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ..గౌడన్నలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన 2020లో గౌడ హక్కుల సాధన పేరిట టేకుమట్ల మండలం నుంచి చిట్యాల,మొగ్గుళ్ళపల్లి,రేగొండ,గణపురం,భూపాలపల్లి వరకు పాదయాత్రను నిర్వహించి జిల్లా కలెక్టర్ కు గౌడ హక్కుల సమస్యలపై నివేదికను సమర్పించారు.బడుగు,బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం పరితపించే పొన్నం బిక్షపతి గౌడ్ ఉన్నతమైన స్థానంలో నిలబడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular