Thursday, April 2, 2026
[t4b-ticker]

ప్రజల ముంగిటకే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక

ప్రజల ముంగిటకే ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక

:మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు.

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 02(ప్రతినిధి మాతంగి సురేష్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 31, 20, 33, 18 వార్డులలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. అన్ని వార్డులలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను మున్సిపల్ కౌన్సిలర్లు సంబంధిత శాఖల అధికారులు స్వీకరిస్టారన్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని వార్డులలో ప్రజాపాలన కార్యక్రమం చేపట్టామన్నారు. స్థానిక సమస్యలపై ప్రజలతో నేరుగా మమేకమవుతూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు అధికారులు ప్రజాప్రతినిధులు తెలిపారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్, కమిషనర్, సీఐ, వార్డ్ కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు, వార్డ్ ఆఫీసర్లు, వార్డ్ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular