కోదాడ,డిసెంబర్10 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రజల సేవలో ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.ఆదివారం కోదాడ పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం పథక ఆవిష్కరణ కార్యక్రమాన్ని హాస్పటల్ సూపరింటెండెంట్ దశరధ నాయక్ ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి పాల్గొని ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీ వారి యొక్క సొంత స్వలాభాలకు అధిక మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు కానీ పేద ప్రజలకు ఎక్కువ ఖర్చయ్యే వైద్యంపై దృష్టి సారించలేదని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం కింద 10 లక్షల రూపాయలు ప్రభుత్వమే భరిస్తుందని ఆమె అన్నారు.కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించటానికి డాక్టర్లు నిరంతరం కృషి చేస్తున్నారని వారి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.గతంలో కంటే హాస్పిటల్ సేవలు ఎక్కువగా ప్రజలకు అందిస్తున్న హాస్పటల్ సిబ్బందికి హాస్పటల్ సూపరింటెండెంట్ దశరథ నాయక్ కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ వెంకటేశ్వర్లు,ఆర్డీవో సూర్యనారాయణ,ఆర్ఎంఓ డాక్టర్ విజయ్,డాక్టర్లు సురేష్ నారాయణ,బావ్ సింగ్,మమత,వైష్ణవి,రసజ్ఞ రెడ్డి,లక్ష్మణ్,అశోక్,సిబ్బంది,కాంగ్రెస్ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి,సామినేని ప్రమీల,రామారావు,రజనీకాంత్,తిరపయ్య తదితరులు పాల్గొన్నారు.



